మెగాస్టార్ ప్రాజెక్ట్ కు మొట్టమొదటిసారి అతన్ని పక్కన పెట్టిన కొరటాల!

Saturday, October 19th, 2019, 11:34:51 PM IST

“సైరా నరసింహా రెడ్డి” లాంటి ఒక ఎపిక్ థ్రిల్లర్ చిత్రం చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేస్తారా అని అంతా అనుకున్నారు.ఈలోగా వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు అయినటువంటి కొరటాల శివతో అనగానే ఇంకో బ్లాక్ బస్టర్ లోడ్ అవుతుందనని అభిమానులు అనుకుంటున్నారు.ఇంకా ఈ చిత్రం మొదలు కాకముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాకపోతే ఈ సినిమాకు మాత్రం కొరటాల మొదటినుంచి తాను నమ్మిన ఒక వ్యక్తిని పక్కన పెట్టేసినట్టుగా సినీ వర్గాల నుంచి సమాచారం.కొరటాల దర్శకునిగా మారిన తర్వాత నుంచి కూడా అన్ని సినిమాలకు సంగీత దర్శకునిగా దేవీశ్రీ ప్రసాద్ వ్యవహరించారు.కానీ మొట్టమొదటిసారిగా కొరటాల దేవిని పక్కన పెట్టేసారు.ఈ విషయాన్ని స్వయంగా దేవినే వెల్లడించారు.మరి ఈసారి ఈ భారీ ప్రాజెక్ట్ కు ఎవరు సంగీతాన్ని సమకూరుస్తారో చూడాలి.