సాహో నిర్మాతలపై ఫ్రాడ్ కేసు.. మ్యాటరేంటంటే..!

Thursday, October 17th, 2019, 09:56:55 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన భారీ ఆక్షన్ ఎంటర్టైనర్, స్పై థ్రిల్ల‌ర్ మూవీ సాహో. ఈ సినిమా ఆగష్ట్ 30వ తేదిన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళంతో పాటు ప‌లు భాష‌ల‌లో రిలీజ్ చేసారు.

అయితే ఈ సినిమాను 350కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించి భారీగా యాక్షన్ సన్నివేశాలు ఉన్నా కూడా కలెక్షన్ల పరంగా మంచి వసూళ్ళు రాబట్టినా, అనుకున్న స్థాయిలో మాత్రం హిట్ కొట్టలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి సినిమా నిర్మాతలపై ఒక ఫ్రాడ్ కేసు నమోదయ్యింది. తమ సంస్థ పేరును సినిమాలో ప్రదర్శిస్తామంటూ నిర్మాతలు 1.40 కోట్లు తీసుకుని మమ్మల్ని మోసం చేశారంటూ ఆర్కిటెక్ ఫాక్స్ సంస్థ చేసిన ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు సాహో నిర్మాతలపై కేసు నమోదు చేశారు. తమకు నిర్మాతల నుంచి పరిహారం ఇప్పించాలని లేదంటే న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆర్కిటెక్ ఫాక్స్ సంస్థ తమ ఫిర్యాదులో పేర్కొంది.