బంద్.బంద్..బంద్… రేపటి నుంచి 5 రాష్ట్రాలలో థియేటర్లు బంద్..!

Thursday, March 1st, 2018, 08:26:31 PM IST

చాలా సంవత్సరాల తర్వాత ఒకేసారి 5 రాష్ర్టాల్లో థియేటర్లను బంద్ చేయనున్నట్లు దక్షిణాది నిర్మాతల మండలి ప్రకటనలు జారి చేసింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ దక్షిణాది నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ నిర్మాత డి సురేశ్‌బాబు వెల్లడించారు. తెలంగాణా, ఆంధ్ర రాష్ర్టాలతోపాటు తమిళనాడు, కేరళ, కర్నాటకలో థియేటర్లు అన్ని బంద్ కానున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత డి సురేశ్‌బాబు మాట్లాడుతూ ఇంగ్లీష్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు కానీ ఆ సినిమాలకు వర్చువల్ ప్రింట్ ఫీజు వసూలు చేయడంలేదని అది సమంజసం కుడా కాదని వ్యాఖ్యానించారు. డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు కుడా ప్రాంతీయ చిత్రాలకు వీపీఎఫ్ తగ్గించట్లేదన్నారు. ఐదు రాష్ర్టాల్లోని నిర్మాతలు, పంపిణీ దారులు తమకు ఈ విషయమై పూర్తి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. వీపీఎఫ్ ధరలు సున్నా చేయడం లేదని, దీనికి కచ్చితంగా చర్య తీస్కోవడం జరుగుతుందన్నారు. డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు దిగి వచ్చే వరకు థియేటర్ల బంద్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగే వరకూ థియేటర్లు తెరిచేది లేదని అప్పటివరకు సినిమాలు రిలీజ్ చేసేది లేదని చెప్పారు.