ఇంద్రను గజినీ గా మార్చిన “ఇస్మార్ట్ జోడి”.!

Friday, May 22nd, 2020, 12:30:01 PM IST

ఇప్పుడు లాక్ డౌన్ ఉన్నప్పటికీ కొత్త కంటెంట్ తో అలరిస్తున్న ఏకైక తెలుగు ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్ ఏదన్నా ఉంది అంటే అది స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయ్యే “ఇస్మార్ట్ జోడి” ప్రోగ్రాం అని చెప్పాలి.బుల్లితెర సెన్సేషనల్ యాంకర్ ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రాం లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ వీడియో కాల్స్ ద్వారా తన ప్రోగ్రామ్ కంటెస్టెంట్స్ నుంచి అదిరిపోయే ఎపిసోడ్స్ ను రాబట్టేస్తున్నారు.

అలా వచ్చే వారం టెలికాస్ట్ చెయ్యబోయే ఎపిసోడ్ సంబంధించి ఒక ఫన్నీ క్లిప్ ను ఇప్పుడు వదిలారు. చక్రవాకం మరియు మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఇంద్ర జిత్ జోడికి ఇచ్చిన ఓ ఫన్నీ టాస్క్ లో ఓంకార్ అతన్ని గజినీగా మార్చేశాడు. ఒక 12 ఐటమ్స్ పేర్లు పెట్టి వాటిని గుర్తుంచుకొని వరుసగా చెప్పుమనగా మధ్యలోకి వచ్చి మర్చిపోయాడు. ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగిన ఈ ఎపిసోడ్ బాగానే ఉన్నట్టుంది. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తెలియాలి అంటే ఈ శనివారం మిస్సవ్వకుండా చూడాల్సిందే.