ప్ర‌కాష్‌రాజ్ కొత్త సినిమా పేరేంటంటే!

Sunday, September 25th, 2016, 02:34:03 PM IST

prakash-raj
న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ ఇక పూర్తిస్థాయిలో ద‌ర్శ‌క‌త్వంపై మ‌న‌సు పెట్టే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. త్వ‌ర‌లో `మ‌న ఊరి రామాయ‌ణం` చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నాడు ప్ర‌కాష్‌రాజ్‌. ఆయ‌న సొంతంగా నిర్మిస్తూ తెర‌కెక్కించిన చిత్ర‌మ‌ది. త‌ప్ప‌కుండా హిట్ట‌వుతుంద‌నే కాన్ఫిడెంట్‌లో ప్ర‌కాష్‌రాజ్ ఉన్నాడు. అందుకే వెంట‌నే మ‌రో సినిమాకి రంగం సిద్ధం చేసుకొన్నాడు. ఆ చిత్రానికి `అర‌వై ఏళ్లు – చామ‌న ఛాయ` అనే పేరుని డిసైడ్ చేశాడ‌ట‌. `మ‌న ఊరి రామాయ‌ణం` త‌ర‌హాలోనే తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో తెర‌కెక్కించాల‌ని నిర్ణ‌యిస్తున్నారు. అర‌వ‌య్యేళ్ల వృద్ధుడి క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంద‌ని, ఆ వృద్ధుడి పాత్ర‌లో ప్ర‌కాష్‌రాజే న‌టిస్తార‌ని తెలుస్తోంది. ప్ర‌కాష్‌రాజ్‌కి న‌ట‌న ప‌రంగా వ‌చ్చే ఆఫ‌ర్ల‌ని ఒప్పుకొన్నా తీరిక లేనంత బిజీగా గ‌డ‌పొచ్చు. కానీ ఆయ‌న మాత్రం మ‌న‌సుకు న‌చ్చిన పాత్ర‌ల‌ని మాత్రమే ఒప్పుకొంటూ, మిగిలిన స‌మ‌యాన్నంతా ద‌ర్శ‌క‌త్వం గురించి వెచ్చిస్తున్నారు. అందుకే ఆయ‌న్నుంచి వ‌రుస‌గా సినిమాలొస్తున్నాయి.