జెమినీ టీవిలో ఇక నుంచి మరిన్ని అదిరిపోయే సినిమాలు!

Tuesday, May 26th, 2020, 09:58:43 AM IST

మన తెలుగులో ఉన్నటువంటి ఛానెల్స్ లో టాప్ ఛానెల్ అయిన జెమిని టీవిలో సరికొత్త సినిమాలతో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మన టాలీవుడ్ కు చెందిన సరికొత్త సినిమాలు అన్నిటిని దాదాపు చుట్టేసి స్మాల్ స్క్రీన్ వీక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించింది.

ఇప్పుడు ఇదే కాకుండా మరింత ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చేందుకు రెడీ కాబోతుందట. సన్ నెట్వర్క్ వారు హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. మొన్న స్పైడర్ మ్యాన్ 3 చిత్రం మొదలు కొని ఇక నుంచి మరిన్ని హాలీవుడ్ సినిమాలు సన్ నెట్వర్క్ ఛానెల్స్ లో ప్రసారం కానున్నట్టు తెలుస్తుంది. దీనితో ఇక నుంచి జెమినీ టీవిలో సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందివవ్వడం ఖాయం అని చెప్పాలి.