బిగ్ అప్ డేట్ : జార్జ్ రెడ్డి సినిమా విడుదల ఆగిపోనుందా…?

Tuesday, November 19th, 2019, 10:30:32 PM IST

మన చరిత్రలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ విభాగంలో ఒక విప్లవ యోధుడిగా అనేకమైన ఉద్యమాలు చేసి, చరిత్రలో మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచుకున్నటువంటి జార్జ్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కినటువంటి జార్జ్ రెడ్డి చిత్రం ఈ నెల 22 న విడుదల కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ చిత్ర విడుదల విషయంలో కొన్ని అవకతవకలు ఏర్పడుతున్నాయని చెప్పుకుంటున్నారు. కాగా ఇటీవల ఈ చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ వేడుకని నెక్లెస్ రోడ్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తూ, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించిన సంగతి మనకు తెలిసిందే.

కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమం ఆగిపోయింది. ఎందుకంటే ఈ వేడుకకు పెద్ద మొత్తంలో విద్యార్థులు, విద్యార్ధి సంఘాలు, నాయకులు అందరు కూడా హాజరవుతారు. దానికి తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తే ఆ ప్రాంతంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని భావించిన నగర పోలీసులు ఈ వేడుకను జరపకుండా అడ్డుకున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన చాలామంది ప్రముఖులు ఈ సినిమాను ఒక రేంజ్ లో మెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని చుసిన ప్రముఖ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సోషల్ మీడియా ద్వారా సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశారు.

జార్జ్ రెడ్డి పాత్రలో నటించిన సందీప్ మాధవ్ నటన చూసిన తరువాత నిజంగానే జార్జ్ రెడ్డి బ్రతికి వచ్చాడా అన్నట్లు ఉందని ప్రశంసల వర్షం కురిపించారు. ఇకపోతే ఈ సినిమా కోసమని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాగా ఏబీవీపీ యూనియన్ వారు ఈ సినిమాలో తమని విలన్ గా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ చిత్ర విడుదలను అడ్డుకుంటామని సవాల్ కూడా చేస్తున్నారు. అందువలన ఈ చిత్రం ఆగిపోయే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ చివరకు ఏమవుతుందో చూడాలి మరి.