రామ్‌గోపాల్ వర్మకు జీహెచ్ఎంసీ ఫైన్.. ఎందుకంటే..!

Tuesday, July 28th, 2020, 04:55:10 PM IST

వివాదస్పద సినిమాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు జీహెచ్ఎంసీ ఫైన్ విధించింది. ఇటీవల ఆర్జీవీ తీసిన పవర్ స్టార్ సినిమాను ఈ నెల 25న ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా లాక్‌డౌన్ తరువాత మొదటి పోస్టర్‌గా పేర్కొంటూ వర్మ ఓ పోస్టర్‌ని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వ ఆస్తిని వినియోగించారని ఓ వ్యక్తి ఆర్జీవీపై జీహెచ్ఎంసీకి కంప్లైంట్ చేశారు. ఇందుకుగానూ వర్మకు జరిమానా వేయాలని ఆ వ్యక్తి డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ ఈవీడీం విభాగం వర్మకు రూ. 4 వేల జరిమానా విధించింది.