భారత్ లో థియేటర్స్ అప్పటి నుంచి తెరుచుకొనే అవకాశం..!

Saturday, July 25th, 2020, 12:01:25 PM IST

కరోనా మూలాన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ మూత పడిపోవడంతో మనుష్యులు ఎంతగానో ఎంజాయ్ చేసే సిసలైన ఎంటర్టైన్మెంట్ బాగా మిస్సవుతున్నారు. ఎన్నో సినిమాలు ఆగిపోవడం సినిమా హాళ్లు నాలుగు నెలల పాటు తెరుచుకోకుండా ఉండటంతో ఆ ఎంజాయ్మెంట్ మాజాను ఎంతగానో మిస్సవుతున్న వారికి ఇప్పుడు దేశ ప్రభుత్వం ఒక చల్లటి వార్తను అందించే సూచనలు కనిపిస్తున్నాయి.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఆగష్టులో తెరుచుకునేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా మొదట టెస్టింగ్ పర్పస్ గా అక్కడక్కడా మాత్రమే తెరుస్తారట అలాగే కేవలం 25 శాతం మందే జనం చూసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారట. ఇప్పటికే ఒకరు తప్పించి ఒకరు చూడాలన్న నిబంధనలు పెట్టిన సంగతి తెలిసిందే. కానీ అందుకు థియేటర్స్ యాజమాన్యం ఒప్పుకోవడం లేదు. కేవలం 25 శాతం జనంతో నడపలేమని చెపుతున్నారట. థియేటర్స్ వచ్చే ఆగష్టు 1 నుంచి తెరిచి 30 వరకు ఉంచే అవకాశాలు ఉన్నట్టు వినికిడి.