ట్రైలర్ టాక్ : గోపీచంద్ ఆక్సిజన్ అదిరింది..

Saturday, September 30th, 2017, 09:47:10 PM IST

టాలీవుడ్ లో యాక్షన్ హీరోగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో గోపీచంద్. గత కొంత కాలంగా అపజయాలను ఎక్కువగా చూస్తున్న ఈ హీరో సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మళ్లీ తన కెరీర్ కు ఆక్సిజన్ లాంటి బూస్ట్ ఇవ్వాలని ఆక్సిజన్ అనే సినిమాతో రాబోతున్నాడు. జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కితున్న ఈ సినిమాను ఏ.ఎమ్ రత్నం నిర్మించారు. రాశి ఖన్నా, అను కథానాయికలు.

యాక్షన్ – ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తరహాలో ఉండే ఈ చిత్రం ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సంతోషాన్ని పంచె మా నాన్న.. నవ్వుతు పలకరించే ప్రియురాలు.. పిలిస్తే పరుగెత్తుకుంటూ వచ్చే స్నేహితులు.. లైఫ్ అంటే నాదే అనుకున్నాను.. అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి.. మళ్లీ ఆ వెంటనే ఎదో ఘటన వల్ల జీవితం మారిపోవడం.. అనుకోని సంఘటనలు చోటు చేసుకోవడం వంటి కోణంలో హీరో ఏం చేశాడు అనే అర్దాన్ని ట్రైలర్ లో చూపించారు. చూస్తుంటే రివెంజ్ డ్రామాగా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా బ్లాస్ట్ కి సంబందించిన సీన్స్ కనిపిస్తున్నాయి. మొత్తానికి ట్రైలర్ తో గోపి ఆకట్టుకున్నాడు. మరి సినిమాతో అయినా ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments