RRR చుట్టూ ముదురుతున్న వివాదాలు – హెచ్చరికలు చేస్తున్న యువజన సంఘాలు

Monday, October 21st, 2019, 10:49:00 PM IST

బాహుబలి లాంటి అద్భుతమైన చిత్రాల తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నటువంటి మరొక అతిపెద్ద భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం RRR. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరు కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కాగా తన చిత్రంలో ప్రతీ సన్నివేశం కూడా అద్భుతంగా రావడం కోసమని పరితపించడం కారణంగా రాజమౌళికి అమరశిల్పి జక్కన్న అనే పేరు కూడా వచ్చేసింది. ఇకపోతే ఆయన తీసిన ప్రతీ చిత్రం కూడా ఎంతటి ఘనమైన విజయాలనునమోదు చేసుకున్నాయి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సృష్టించిన రికార్డులు ఇప్పుడప్పుడే మర్చిపోయేటివి కాదు. అయితే రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్నటువంటి చిత్రంలో కూడా ఎలాంటి సమస్యలు, అవకతవకలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇకపోతే అలాంటి RRR చిత్రానికి మొదటి నుండి ఎన్నో ఆటంకాలు ఎదురౌతున్నాయి. కాగా తాజాగా ఈ RRR చిత్రానికి కూడా కొన్ని వివాదాలు ఎదురవుతున్నాయి. కాగా ఈ చిత్రంపై అల్లూరి యువజన సంఘం సభ్యులు తీవ్రమైన అభ్యన్తరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం డబ్బుల కోసం, కమర్షియల్ అంశాల కోసమే ఈ ఇద్దరు మహోన్నతమైన వ్యక్తుల చరిత్రను వక్రీకరిస్తూ, చరిత్రను తప్పుబడుతున్నారని వాపోతున్నారు. అంతేకాకుండా అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లు ఎక్కడ కలిసినట్లు కానీ వాళ్ల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని చరిత్ర లో ఎక్కడ కూడా లేదని, అలాంటి అంశాలతో ఎలా సినిమా తీస్తారని నర్సీపట్నం ఆర్డీవో కి వీరభద్రరావు వినతిపత్రం అందించారు. అయితే ఈ విషయంలో దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.