అపుడు “డీజే” .. ఇపుడు “గద్దలకొండ గణేష్”…

Friday, September 20th, 2019, 11:00:34 AM IST

హరీష్ శంకర్ పేరు గబ్బర్ సింగ్ తో మారుమోగిపోయింది. తీసింది తక్కువ సినిమాలే అయినా ,పవన్ కళ్యాణ్ కి అతి పెద్ద హిట్ ఇవ్వడం తో సినీ ఇండస్ట్రీ లో ఇక పెర్మనెంట్ గా సెటిల్ అయిపోయారు. వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్రం టైటిల్ బోయ, వాల్మీకి జాతి ప్రజలని కించ పరిచేలా ఉందని హైకోర్టు లో పిటిషన్ వేయడం తో వాల్మీకి చిత్ర బృందం తలలు పట్టుకుంది. చివరకు వాల్మీకి చిత్రాన్ని గద్దలకొండ గణేష్ గా మార్చారు.

ఈ చిత్ర వివాదం పై గురువారం రాత్రి హరీష్ శంకర్ వివరణ ఇచ్చారు. సినిమాలో వాల్మీకి మహర్షి పై తప్పుడు గా చిత్రీకరించలేదని, సినిమా చుస్తే ఇంకా మీరే మెచ్చుకుంటారని అన్నారు. ఫస్ట్ టైం ఓడిపోయానని అన్నారు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ రీమేక్ చిత్రాలే, డీజే చిత్రానికే స్టోరీ వివాదం, బ్రాహ్మణులను కించపరిచారు అంటూ మరొక వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. కాగా ఇపుడు ఈ చిత్రానికి టైటిల్ వివాదం. మరి హరీష్ శంకర్ ఇకనైనా రూట్ మారుస్తారో లేదో తన తదుపరి చిత్రం తో తెలుస్తుంది.