అప్పుడు ఛాన్స్ కోసం, ఇప్పుడు “మీటూ “

Friday, October 26th, 2018, 10:27:05 AM IST

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ని మీటూ ఉద్యమం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే, సౌత్ లో కూడా ఈ ప్రకంపనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాలు గా నోరు మెదపని హీరోయిన్ లు ఇతర మహిళలు ఇప్పుడు ఈ ఉద్యమ నేపథ్యం లో మీడియా ముందుకు వచ్చి ఇండస్ట్రీ ప్రముఖుల పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కన్నడ పరిశ్రమ కు చెందిన నటి హర్షిక పునాచా మీ టూ అంటూ లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న కొందరి పై తీవ్ర స్థాయి లో మండిపడింది.

ఇప్పుడు లైంగిక వేధింపులకు గురైనట్టు ఆరోపిస్తున్న వారంతా ఒకప్పుడు సినిమా చాన్సుల కోసం సెలబ్రిటీ స్టేటస్ కోసం ఇండస్ట్రీ ప్రముఖుల తో విచ్చలవిడి గా తిరిగిన వారే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వప్రయోజనాల కోసం అప్పుడు వారితో పడుకున్నపుడు మీటూ గుర్తురాలేదా అంటూ ప్రశ్నించింది. అయితే మీటూ కు తానూ వ్యతిరేకం కానీ కాదని, మీటూ పేరుతో పబ్లిసిటీ కోసం కొంతమంది పాకులాడుతున్నారని వారికి తానూ వ్యతిరేకం అని చెప్పుకొచ్చింది. హర్షిక వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ లో చర్చనీయాంశం అయ్యాయి. హర్షిక పేరు పెట్టి ఆరోపణలు చేయకపోయినా అవి ఎవరికీ తగలాలి వారికి తగిలాయి అంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments