“సైరా”పై వస్తున్న రూమర్లకు చెక్!

Thursday, November 14th, 2019, 09:30:37 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. మొదటి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర మీద తెరకెక్కిన ఈ చిత్రం ప్రతీ ఒక్కరి మన్ననలు అందుకుంది.అయితే ఓవరాల్ గా మాత్రం ఊహించిన స్థాయి విజయాన్ని అయితే అందుకోలేకపోయింది.ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి ఈ చిత్రంపై కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.

వెండితెరపై ఈ చిత్రాన్ని చూసిన జనం అంతా ఇప్పుడు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ ద్వారా చూడాలని అనుకుంటున్నారు.దీనితో ఈ చిత్రం డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వారిని ఎప్పుడు అధికారికంగా పెడుతున్నారని అడగసాగారు.ఇంతలో కొంతమంది ఈ చిత్రం ఈ నవంబర్ 15 నుంచి స్ట్రీమ్ అవ్వనుంది అని అప్పటి నుంచి చూడొచ్చని ప్రచారం చేసారు.కానీ అసలు విషయంలోకి వెళ్లినట్టయితే అసలు తాము ఇంకా ఎలాంటి ప్రకటన చెయ్యలేదని సైరా స్ట్రీమింగ్ కు సంబంధించి అన్ని వివరాలు త్వరలో చెప్తామని అమెజాన్ వారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.సో ఇప్పుడిపుడే అయితే సైరా అమెజాన్ ప్రైమ్ లో రాకపోవచ్చు.