“సరిలేరు నీకెవ్వరు” పై వైరల్ అప్డేట్.!

Friday, November 15th, 2019, 05:49:12 PM IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న “సరిలేరు నీకెవ్వరు” చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలను మూటగట్టుకుంది.ముఖ్యంగా అభిమానులు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యిపోయారు.

ఇదిలా ఉండగా గత కొంత కాలం నుంచి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేసిన చిత్ర టీమ్ ఇప్పుడు సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్నా టీజర్ కు సంబంధించి కానీ ఫస్ట్ సింగిల్ కు సంబంధించి కానీ ఎలాంటి సమాచారాన్ని కూడా ఇవ్వకపోతుండడంతో అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు.

కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా టీజర్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సమయం ఎలాగో దగ్గర పడుతుంది కాబట్టి ముందుగా టీజర్ నే విడుదల చెయ్యడానికి యూనిట్ సిద్ధం అయ్యినట్టు సమాచారం.వచ్చే వారంలోనే తాము టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారో అన్న దానికి సంబంధించిన అప్డేట్ ను విడుదల చేస్తారని సమాచారం.మరి వచ్చే వారం నిజంగానే టీజర్ పై ఏదన్నా అప్డేట్ ఉంటుందో లేదో చూడాలి.