అసలు “వకీల్ సాబ్” డిజిటల్ గా ఎలా వస్తుంది అనుకున్నారు?

Tuesday, May 19th, 2020, 01:54:47 PM IST

ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా చలన చిత్ర పరిశ్రమ స్తంభించిపోయింది. దీనితో అప్పటి వరకు షూటింగ్ పూర్తి కాబడిన చిత్రాలు అన్ని విడుదల ఆగిపోయాయి. ఇదిలా ఉండగా అలా ఆగిపోయిన చిత్రాలు అన్ని ఇప్పుడు డిజిటల్ గా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. మెల్లగా చిన్న సినిమాలు మరియు డబ్బింగ్ చిత్రాలు నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వస్తుండడం పెద్ద సినిమాలపై కూడా పడింది.

వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం “వకీల్ సాబ్” కూడా ఒకటి. నిర్మాత దిల్ రాజు డ్రీం ప్రాజెక్ట్స్ గా చెప్పుకొచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ మంచి హైప్ ను తెచ్చుకుంది. పరిస్థితులు అన్ని బాగా ఉండి ఉంటే ఈ పాటికే సినిమా విడుదల కూడా అయ్యిపోయి ఉండేది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా కూడా ఆగిపోయింది.

దీనితో ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ వారు భారీ మొత్తంలో ఆఫర్ చేశారని డిజిటల్ గా వచ్చేస్తుంది అని అనేక వార్తలు వినిపించాయి. కానీ అసలు లాజిక్ ను చాలా మంది మర్చిపోయారు. ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కానే లేదు అలాంటప్పుడు డిజిటల్ గా ఎలా వచ్చేస్తుందో అన్నది ఎవరూ ఆలోచించలేదు. ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేసే వారు ఇకనైనా ఇలాంటివి మానుకుంటే మంచిది.