ఖైదీ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హృతిక్ రోషన్..!

Tuesday, February 11th, 2020, 07:19:16 PM IST

హీరో కార్తీ నటించిన ఖైదీ మూవీ గత ఏడాది దీపావళి కానుకగా తమిళ్, తెలుగులో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కార్తీ యాక్టింగ్, లోకేశ్ కనకరాజ్ గ్రిప్పింగ్‌గా కథ చెప్పిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అయితే డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి కలెక్షన్లను రాబట్టడంతో హిందీలో ఈ సినిమాను రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే ఖైదీ ఒరిజినల్ వర్షన్‌ను చూసిన హృతిక్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇటీవ‌ల వార్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన హృతిక్ త్వరలోనే ఈ ఖైదీ రీమేక్‌లో నటించనున్నారట.