సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేశ్ రన్నింగ్ వర్కౌట్..!

Thursday, May 28th, 2020, 01:36:22 AM IST

కరోనా కారణంగా దేశమంతా లాక్‌డౌన్ పాటిస్తున్న నేపధ్యంలో సినిమాలు, షూటింగ్‌లు అన్ని ఆగిపోయాయి. దీంతో హీరో మహేశ్ బాబు ఇంట్లోనే ఉంటూ తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నాడు. అయితే ఇంట్లో ఉన్నా ఫ్యనస్ కోసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గానే ఉన్నాడు.

అయితే తాజాగా మహేశ్ రన్నింగ్ మిషీన్‌పై వర్కౌట్ చేస్తూ కనిపించాడు. మహేశ్ భార్య నమ్రత తన ఇన్‌స్టాగ్రాంలో మహేశ్ రన్నింగ్ వర్కౌట్ వీడియోను షేర్ చేస్తూ ఇది మహేశ్‌కి డైలీ డోస్ అని చెప్పుకొచ్చింది. అయితే రన్నింగ్ మెషిన్‌పై మహేశ్ పరుగెడుతున్న స్టైల్ అదిరిపోవడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.