నేను పెళ్లి చేసుకోలేదు బాబోయ్.. అంటున్న హీరో

Sunday, September 25th, 2016, 10:56:26 AM IST

Raj-Tharun
సాధారణంగా సినీ సెలబ్రిటీల పై రూమర్లు రావడం షరా మామూలే. అదీ ప్రస్తుతం ఫేమ్ లో ఉన్న వాళ్లపై అయితే మరీ ఎక్కువ. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే హీరో రాజ్ తరుణ్, యాంకర్ లాస్యలు పేస్ చేస్తున్నారు. ఎలా పుట్టింది, ఎవరు పుట్టించారో కానీ నిన్నంతా రాజ్ తరుణ్, లాస్యలు రహస్య వివాహం చేసుకున్నారని సోషల్ మీడియాలో నానా భీభత్సం చేశారు. ఎక్కడ చూసిన వీళ్ళ గురించే చర్చలు. కొంతమంది అతి ఉత్సాహవంతులు ఒక మెట్టు పెరికెక్కేసి వీరికి సినిమా పక్కీలో ఓ లవ్ స్టోరీని కూడా అల్లేసి రచ్చ రచ్చ చేశారు.

దీంతో విసుగు చెందిన హీరో రాజ్ తరుణ్ నేరుగా ట్విట్టర్లో ‘2కుమారి 1 ఎఫ్ ఆడియో రిలీజ్ టైం లో యాంకర్ లాస్యను ఒకేఒక్కసారి కలిశాను. దీంతో నా ప్రమేయం లేకుండానే లాస్యతో నా పెళ్లి చేసిన కొంతమంది మీడియా మిత్రులకు, వెబ్ సైట్ దరిద్రులకు నా కృతజ్ఞతలు. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఇంకో మూడు సంవత్సరాలు పెళ్లి చేసుకోను. ఆ తరువాత చేసుకుంటే మీకు చెప్పే చేసుకుంటాను’ అని తన భాధను వ్యక్తపరిచాడు.