త్వరలో రామ్ మల్టీ స్టారర్

Saturday, October 27th, 2018, 05:43:44 PM IST

హలో గురు ప్రేమ కోసమే తో డీసెంట్ హిట్ కొట్టిన ఎనర్జిటిక్ హీరో రామ్, అదే ఊపు లో తన తదుపరి చిత్రం పట్టాలు ఎక్కించే పనిలో పడ్డాడు. మల్టీ స్టారర్ లో నటిచబోతున్నా అంటూ ప్రకటించాడు, అయితే తనతో పాటు ఈ చిత్రం లో నటించే మరో హీరో ఎవరన్నది మాత్రం సస్పెన్స్ అట. హలో గురు ప్రేమ కోసమే సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా ఈ చిత్ర యూనిట్ విశాఖ లో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో హీరో రామ్ మాటాడుతూ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా చాలా భాగం విశాఖ లోనే షూట్ చేసాం అని, రానున్న రోజుల్లో విశాఖ సినిమా రంగానికి రాజధాని అవబోతోందని, విశాఖ అందాలు అంటే నాకు చాలా ఇష్టం అంటూ విశాఖ పై తనకున్న ఇష్టాన్ని వ్యక్తపరిచారు.

దర్శకుడు త్రినాథరావ్ నక్కిన మాటాడుతూ సినిమా కలెక్షన్లు ఎక్కడా డ్రాప్ అవకుండా అన్ని షోలు రన్ అవుతున్నాయని, విశాఖ లో సినిమాలు తీసేందుకు బాలీవుడ్ నిర్మాతలు సైతం వస్తున్నారని విశాఖ బీటీఫుల్ స్పాట్ అంటూ పొగిడేశారు. ఈ సినిమాలో నటించిన హీరోయిన్లు అనుపమ, ప్రణీత మాటాడుతూ ఇంత సూపర్ హిట్ మూవీ దక్కినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేసారు. మొత్తానికి ఈ సందర్బంగా తన తదుపరి చిత్రం గురించి ప్రకటించిన రామ్, తనతోపాటు నటిచబోయే మరో హీరో పేరు చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టాడు.

  •  
  •  
  •  
  •  

Comments