బాలకృష్ణ బాటలో సూర్య తండ్రి..!

Tuesday, October 30th, 2018, 11:50:05 AM IST

సెలెబ్రిటీలతో సెల్ఫీ దిగటానికి యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు, అయితే అపుడపుడు సెలెబ్రిటీలు సహనానికి లోనవుతుంటారు. ప్రముఖ తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ అలా పలుమార్లు అసహనానికి గురై అభిమానుల మీద చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ హీరో సూర్య తండ్రి కూడా ఈ వరుసలో చేరారు, మదురైలో ఓ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా వెళ్లిన ఈయనతో ఒక అభిమాని సెల్ఫీ తీసుకొనే ప్రయత్నం చేయగా ఫోన్ ని చేత్తో తీసుకొని నేలకేసి కొట్టారు. ఈ ఘటన సదరు యువకుడ్ని, అక్కడున్న వారందర్ని షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

హీరో సూర్య తమిళ్ లోనే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు, గజినీ, సింగం లాంటి ఎన్నో హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవల 24 సినిమా తో ప్రశంసలు అందుకున్న సూర్య ప్రస్తుతం ఎన్ జీ కే అనే చిత్రంలో నటిస్తూన్నాడు. సూర్య తండ్రి శివకుమార్ కూడా పలు సినిమాలు, సీరియల్స్ తో తెలుగువారికీ సుపరిచితమే. మొత్తానికి ఈ సంఘటన అభిమానులను షాక్ కి గురి చేసింది. కొంత మంది నెటిజన్లు ఈయన చేసిన పనికి మండిపడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments