కల్న‌ల్ సంతోష్‌బాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన హీరో విష్వ‌క్ సేన్‌..!

Saturday, June 20th, 2020, 10:35:35 PM IST


భారత్, చైనా స‌రిహ‌ద్దుల్లో గాల్వ‌న్ లోయ వ‌ద్ద జ‌రిగిన ఘటనలో వీరమరణం పొందిన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని’హిట్’ సినిమా హీరో విష్వ‌క్ సేన్ ప‌రామ‌ర్శించారు. నేడు సూర్యాపేట‌లోని సంతోష్‌బాబు నివాసానికి వెళ్ళిన విష్వ‌క్ సేన్‌ ఆయన చిత్రపటానికి నివాళుల‌ర్పించి, కుటుంబ స‌భ్యుల‌ను పరామర్శించారు.

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన విష్వ‌క్ సేన్ దేశం కోసం ఈ కన్న తల్లి చేసిన త్యాగం వెలకట్టలేనిదని ఆర్మీకి, వారి కుటుంబాలకు మ‌నం రుణ‌ప‌డి ఉండాలని అన్నారు. సంతోష్ బాబు లాంటి నిజమైన సైనికులను దేశం కోసం త్యాగం చేసిన ఆ కన్న తల్లికి కృత‌జ్ఞ‌త‌లతో పాటు సంతాపాన్నీ తెలిపానని, కుమారుడిని కోల్పోయిన‌ ఆమె ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌ని ఊహించుకున్నా కూడా నా హృద‌యం త‌ల్ల‌డిల్లుతోందని అన్నారు. ఏమిచ్చినా తీర్చుకోలేని మ‌న వీర సైనికుల కుటుంబాల‌కు ఆత్మ స్థైర్యం ల‌భించాల‌ని మనమంతా ప్రార్ధించాలని అన్నారు.