వేశ్యగా చేయడానికి ఓకే అంటున్న పాయల్ రాజ్ పుత్..!

Sunday, June 2nd, 2019, 08:10:36 PM IST

ఆర్ ఎక్స్ 100 చిత్రం ద్వారా మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తాజాగా మరో కొత్త సినిమాలో నటించడానికి ఓకే చెప్పేసింది. అయితే ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత ఈ అందాల భామకు అవకాశాలు మిన్నుగానే వస్తున్నాయనేది సమాచారం. అయితే ఇటీవలే విడుదలైన సీత సినిమాలో బుల్ రెడ్డి అంటూ ఐటెం సాంగ్ చేసి కుర్రకారులో ఒక ఊపు తీసుకొచ్చింది. అయితే మరో సారి తాను ఒక కొత్త చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించనున్న ఓ బయోపిక్ మూవీలో పాయల్ వేశ్యగా నటించడానికి ఒకే చెప్పడంతో ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కూడా పరుగులు పెడుతుంది.

అయితే ప్రస్తుతం సీనియర్ హీరోలైన వెంకటేష్, రవితేజ సరసన వెంకీ మామా, డిస్కో రాజా చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాదు కొత్తగా ఆర్డీఎక్స్ లవ్ అనే చిత్రాన్ని కూడా ఈమె ఒప్పుకున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాల తరువాత బెల్లం కొండ శ్రీనివాస్ హీరొగా తెరకెక్కుతున్న స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగ్వేశ్వర్ రావు బయోపిక్‌లో ఒక వేశ్య క్యారెక్టర్‌లో నటించబోతుంది పాయల్ రాజ్ పుత్. వేశ్య పాత్ర అయినా ఎటువంటి సంచయం లేకుండా ఒకే చెప్పిందట. అయితే ఇలా హీరోయిన్‌గానే కాకుండా తన ఐటెం సాంగ్‌లతో, ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్‌లతో ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతుంది పాయల్ రాజ్ పుత్.