మ‌రో ఎటాక్‌ : `ప‌ద్మావ‌తి` సెట్‌లో హైటెన్ష‌న్‌..

Sunday, September 24th, 2017, 11:03:51 PM IST


సంజ‌య్ లీలా భ‌న్సాలీకి ఇప్ప‌ట్లో తిప్ప‌లు త‌ప్పేలా లేవు! రాజ్‌పుత్ క‌ర్ణి సేన‌లు అత‌డిని వ‌దిలిపెట్టేట్టు క‌నిపించ‌డం లేదు. `ప‌ద్మావ‌తి` జీవిత‌చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రిస్తూ అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ ప్రేయ‌సిగా చూపిస్తావా? అంటూ ఒక‌టే కారాలు మిరియాలు నూరుతున్నాయి క‌ర్ణిసేన‌లు. వీలున్న చోట‌ల్లా షూటింగ్ స్పాట్‌ల‌కు వెళ్లి ఎటాక్ చేస్తూ వేడి పెంచేస్తున్నారు. అలాంటిదే తాజాగా మ‌రో ఎటాక్‌.

ఏడాది ఆరంభ‌మే `ప‌ద్మావ‌తి` సెట్స్‌పై దాడి చేసి భీభ‌త్సం సృష్టించిన క‌ర్ణి సేన‌లు భ‌న్సాలీని చిత‌క్కొట్టారు. మ‌రోసారి అలాంటి ఎటాక్‌నే చేశారు. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్‌-జైపూర్‌లోని రాజ్‌మందిర్ సినిమా హాల్‌లో షూటింగ్ స్పాట్‌కి వ‌చ్చిన క‌ర్ణి సేన‌లు అక్క‌డ ప‌ద్మావ‌తి పోస్ట‌ర్లను చించి భీభ‌త్స‌వం సృష్టించారు. నేరుగా సెట్స్‌పై ఎటాక్ చేశారు. యూనిట్ స‌భ్యుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ షూటింగుకి అడ్డు త‌గిలారు. “ప‌ద్మావ‌తి చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రిస్తున్నారు. ప‌ద్మావ‌తి ప్రేమ‌క‌థ‌లో వాస్త‌వం లేనేలేదు“ అంటూ క‌ర్ణి సేన‌లు ఆరోపించ‌డం విశేషం. డిసెంబ‌ర్ 1న రిలీజ్‌కి ముందే క‌ర్ణి సేన‌ల కోర్ క‌మిటీకి మూవీని చూపించాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. ఈ వివాదం చూస్తుంటే అంత‌కంత‌కు మ‌రింత‌గా పెట్రేగిపోయేట్టే కనిపిస్తోంది.. ఇప్ప‌టికి భ‌న్సాలీ షూటింగ్ ఆపేశారు. అయితే ఈ ఎటాక్‌ల వ‌ల్ల చిత్రీక‌ర‌ణ మ‌రింత‌గా ఆల‌స్య‌మైతే, ఆ ప్ర‌భావం బ‌డ్జెట్‌పైనా, రిలీజ్‌పైనా ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు. చూద్దాం..ఈ క్లిష్ట‌ స‌న్నివేశాన్ని ఎలా ఎదుర్కోబోతున్నాడో?

Comments