హిందీ ఆర్ఎక్స్ 100 హీరో కన్ఫర్మ్ అయ్యాడు ?

Thursday, October 11th, 2018, 11:26:17 PM IST

తెలుగులో కార్తికేయ, పాయల్ రాజపుట్ జంటగా కొత్త దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 సినిమా సంచలనం రేపిన విషయం తెలిసిందే. చిన్న చిత్రంగా విడుదలై బాక్స్ వద్ద భారీ వసూళ్లను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళంలో ఆది పినిశెట్టి రీమేక్ చేస్తుండగా .. హిందీలో ఎవరు రీమేక్ చేస్తారా అన్న ఆసక్తి నెలకొంది .

తాజాగా ఈ సినిమాలో హీరో కన్ఫర్మ్ అయ్యాడు .. ఇంతకీ హీరో ఎవరో తెలుసా .. హీరో సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నా విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ రీమేక్ పై బి టౌన్ వర్గాల్లో ఆసక్తి ఎక్కువైంది.