మూవీ రిపోర్ట్ : “హిప్పీ”

Thursday, June 6th, 2019, 07:15:28 AM IST

తన మొదటి సినిమా అయినటువంటి RX 100 అనే సినిమాతో హీరో కార్తికేయ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.అంతే కాకుండా మొదటి సినిమాయే మంచి సబ్జెక్టు ఎంచుకోవడంతో విమర్శకుల మన్ననలు కూడా పొందాడు.ఇప్పుడు ఇదే కార్తికేయ హీరోగా దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా టిఎన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “హిప్పీ” ఈ రోజే ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.ఇక ఈ సినిమా ఫైనల్ రిపోర్ట్ విషయానికి వచ్చినట్టయితే కార్తికేయ తన రెండో రెండో సినిమాతోనే ఆకట్టుకున్నాడా అంటే అస్సలు లేదనే చెప్పాలి.

కోలీవుడ్ కు చెందిన ఈ దర్శకుడు ఈ సినిమాను అస్సలు ఏ మాత్రం కూడా ఆసక్తికరంగా మలచలేక పోయాడని చెప్పాలి.అస్సలు కథలోని ఫైట్ సన్నివేశాలు ఎందుకు వస్తాయో మళ్ళీ హీరోయిన్ తో లవ్ సన్నివేశాలు ఎందుకు వస్తాయో సినిమా చూసే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.అలాగే ఒక సీన్ కి మరో సీన్ కి ఎలాంటి పొంతన లేకపోవడం వలన సినిమా పై ఏమంత ఆసక్తిని కనబర్చదు.మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పరమ బోరింగ్ చిత్రంగా నిలుస్తుందని చెప్పాలి.అంతే కాకుండా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కార్తికేయ ఈ సినిమాతో గట్టి దెబ్బే తిన్నాడని చెప్పాలి.