వైరల్: చొక్కా ప్యాంట్ రెండూ విప్పేసిన యువ హీరోలు..!

Wednesday, June 5th, 2019, 05:07:13 PM IST

టీఎన్ క్రిష్ణా దర్శకత్వంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తీకేయ, దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం హిప్పీ. సీనియర్ నటుడు జేడి చక్రవర్తి కూడా ఈ సినిమాలో ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం జూన్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ప్రమోషన్స్ కూడా బాగానే మొదలుపెట్టారు. అయితే ఎవరైనా ప్రమోషన్‌కి సంబంధించి అన్ని చిత్ర యూనిట్‌లు ప్రస్తుతం ఏ విధంగా అయితే చేస్తున్నాయో అలానే చేయడం సహజం. అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్ మాత్రం సాదాసీదాగా చేయడంలేదు. ఇప్పటి వరకు ఎవరు చేయని రీతిలో చెసి చూయించారు.

ఇంతకీ ఏం చేసారనే కదా మీ సందేహం. ఓ కాఫీ షాప్‌లో యాంకర్ హేమంత్‌తో చిత్ర ప్రమోషంకి సంబంధించిన ఇంటర్వ్యూ ముగించుకుని బయటకు వస్తున్న కార్తీకేయ, జేడీ చక్రవర్తిలను యాంకర్ హేమంత్ సార్ ఒక్క నిమిషం ఫైనల్‌గా మిమ్మలని ఒక ప్రశ్న అడగడం మరిచిపోయా ఇంతకీ హిప్పీ అంటే ఏంటీ సార్ అని కార్తికేయను అడగగా కార్తికేయ వెంటనే తన ఒంటి మీద ఉన్న చొక్కను కాఫీ షాప్‌లోనే విప్పి ఇదే హిప్పి అంటే అని అన్నాడు. ఆ తరువాత హిప్పి అంటే ఏంటి సార్ అని జేడీని అడగగా తానేమో ఏకంగా ఫ్యాంట్ విప్పి చూపిస్తూ హిప్పీ అంటే ఇదే అని అన్నాడు. అయితే ఇదంతా చూసిన కాఫీ షాప్‌లో ఉన్న అమ్మాయిలు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అయితే ఇదంతా ప్రమోషన్ కోసం చేసిన ఓ వీడియోలో భాగమట. ఏది ఏమైనా ప్రమోషన్ కోసం ఇలా అందరి ముందు బట్టలు విప్పడం బాలేదంటూ నెటిజన్‌లు వీరిపై మండిపడుతున్నారట. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

#WhatisHIPPI? 🤔
Find it out here 🤣👇🏻

#HippiOnJune6th

Posted by Telugu Filmnagar on Tuesday, 4 June 2019