“హిట్” అంటే ఇదే అంటున్న విశ్వక్ సేన్!

Tuesday, February 11th, 2020, 12:15:45 PM IST

ఫలక్నుమా దాస్ చిత్రం తో హిట్ కొట్టిన విశ్వక్ సేన్ ఇపుడు హిట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఇటీవల విడుదల అయిన హిట్ టీజర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ చిత్రం పేరు గురించి ప్రేక్షకుల్లో చాల ప్రశ్నలు ఏర్పడ్డాయి. అందులో మొదటిది హిట్ అంటే ఏంటి అని. అయితే ఈ హిట్ వెనుక ఒక అర్ధం ఉందని చిత్రం బృందం తాజాగా ఒక వీడియో ద్వారా తెలియజేసింది.

అయితే ఈ ప్రోమోలో విశ్వక్ సేన్ ఒక కేసు కు సంబందించిన వివరాలు వెల్లడిస్తూ కనిపించారు. అయితే ఈ కేసు వివరాలను హిట్ లో పెట్టనున్నట్లు తెలపగా, సర్ హిట్ అంటే ఏంటి అని అడుగుతారు. దానికి హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం అని తెలుపుతారు. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రీతీ అని ఒక మిస్సింగ్ అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తుంది. ఈ నెల 28 న విడుదల కానున్న హిట్ చిత్రం ఫై విశ్వక్ సేన్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తుంది.