హిట్టా లేక ఫట్టా : “పేట” – వింటేజ్ తలైవా ఈజ్ బ్యాక్..కానీ..

Thursday, January 10th, 2019, 07:22:06 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకతంలో తెరకెక్కిన తాజా చిత్రం “పేట”.తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ చిత్రం ఈ రోజే విడుదలయ్యింది.సీనియర్ నటి సిమ్రాన్,ప్రముఖ హీరో విజయ్ సేతుపతి,త్రిష ఇలా ప్రముఖ నటులు అంతా ఈ చిత్రంలో ఉన్నారు.2.0 దెబ్బకి మన తెలుగు రాష్ట్రాల్లో రజిని క్రేజ్ తగ్గినా మిగతా చోట్ల రజిని మానియా అలానే ఉంది.అక్కడ భారీగానే విడుదలయ్యింది.అలాగే పెద్ద అంచనాలు లేకుండానే మన దగ్గర విడుదలయ్యింది.సంక్రాంతి బరిలో ఈ సినిమా కూడా విడుదలయ్యింది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత వరకు విజయం సాధించిందో ఇప్పుడు చూద్దాం.

గత కొంత కాలం నుంచి సూపర్ స్టార్ రజిని స్టార్ దర్శకులకే కాకుండా మంచి ప్రతిభ ఉన్నటువంటి కొత్త దర్శకులకి కూడా బాగానే ఛాన్స్ ఇస్తున్నారు.అలానే “కబాలి” సినిమా తీసి ఘోర పరాజయం పాలయ్యింది.ఆ ఎఫెక్ట్ చాలా గట్టిగానే తగిలింది అలంటి శంకర్ తో తీసిన 2.0 సినిమాని కొనడానికే పెద్దగా ఎవరు ఆసక్తి చూపలేదు.అలాగే మరీ ఎక్కువ అంచనాలతో కాకుండా రజిని రేంజ్ కి తగ్గట్టుగానే విడుదలయ్యింది.ఇక ఈ సినిమా విశ్లేషణలోకి వెళ్లినట్టయితే కార్తీక్ సుబ్బరాజ్ రజినీని అయన యొక్క ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలి అనుకుంటున్నారో చాలా రోజుల తర్వాత చూపించారనే చెప్పాలి,ఫస్టాఫ్ అంతా రజిని మార్క్ స్టైలిష్ నటన,కామెడీతో ఆకట్టుకున్నారు.అలాగే లుక్స్ పరంగా గాని వేరే ఇతర అంశాల్లో కానీ రజిని వయసు ఎక్కడా తక్కువలా కనిపించకుండా ఫ్రెష్ లుక్ ఉండే విధంగా కార్తీక్ సుబ్బరాజ్ రజిని పాత్రను తెరకెక్కించడంలో విజయం సాధించారనే చెప్పాలి.

కథానుసారం వచ్చే యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే ఉంటాయి.ఇంకా అనిరుద్ యొక్క సంగీతం విషయానికి వచ్చినట్టయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో అనిరుద్ తానేంటో మరోసారి నిరూపించుకున్నారు.కొన్ని కీలక అంశాలతో ఊహించని ట్విస్టులతో ఫస్టాఫ్ అంతా సాఫీగానే సాగుతుంది.ఈ సినిమాతో వింటేజ్ రజినీని కార్తీక్ గుర్తు చేసినా కథనం పాతదే ఎంచుకోవడంలో మాత్రం కాస్త నిరుత్సాహ పరిచాడు.కాస్త సాగదీతగా ఉండే సెకండాఫ్,రొటీన్ రివెంజ్ డ్రామా కావడంతో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులు ముందుగానే ఊహించేస్తారు.అలాగే సెకండాఫ్ లో .రజిని మరియు విజయ్ సేతుపతిలు కనిపించే ఎపిసోడ్స్ సినిమాని ఎక్కడో సైడ్ ట్రాక్ పట్టిస్తున్నట్టుగా అనిపిస్తుంది.ఈ విషయంలో కార్తీక్ ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే ఫలితం యొక్క సౌండ్ ఇంకాస్త గట్టిగా వినిపించేది.విలన్ గా నవాజుద్దీన్ సిద్ధికీ బాగానే మెప్పించారు.ఇక సీనియర్ హీరోయిన్ సిమ్రాన్,ఇంకా త్రిష,మేఘా ఆకాష్ లు బాగానే ఆకట్టుకున్నారు.

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ సినిమా రజినీకాంత్ కోసం,అయన స్టైల్,లుక్స్ అమితంగా ఇష్టపడే వాళ్లకు మంచి చిత్రంగా నిలబడుతుంది.అలాగే రజిని అభిమానులకు మాత్రం వింటేజ్ రజినీని మళ్ళీ తెరపై చూసిన అనుభూతి కలుగుతుంది.అలాగే దర్శకుడు ఎంచుకున్న కథను ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసేసిన ఫార్మాట్(రివెంజ్ డ్రామా) లానే ఉంటుంది.అందువల్ల సాధారణ ప్రేక్షకులకు అయితే పెద్దగా కిక్ ఇవ్వదు.ఈ చిత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలవొచ్చు.

123telugu.com Rating : 2.75/5 – రజిని ఫ్యాన్స్ కు మాత్రమే
timesofindia.com Rating : 3.5/5 – క్లాసిక్ స్టైల్ ఆఫ్ రజినీకాంత్
thehansindia.com Rating : 2.5/5 – కేవలం రజిని అభిమానులు చూడొచ్చు.
greatandhra.com Rating : 2.75/5 – ర‌జినీ ఈజ్ బ్యాక్, కానీ..!
news18.com Rating : 1/5 – Rajinikanth’s Gimmicky Journey is a Yawning Bore.