ఆర్ఆర్ఆర్ లో ఆ సీన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందట!

Thursday, April 29th, 2021, 08:50:13 AM IST

Rajamouli-RRR

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం కి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా వైరల్ గా మారుతోంది. అయితే ఇద్దరు మాస్ హీరోలను ఎంతో పవర్ ఫుల్ గా చూపించనున్నారు రాజమౌళి. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ పులితో వచ్చే సన్నివేశం, ప్రీ ఇంటర్వల్ లో రామ్ చరణ్ యాక్షన్ సీక్వెన్స్ గురించి ఇప్పటి వరకూ చాలా చర్చలు జరిగాయి. అయితే ఇందులో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరు కలిసి తెర పై పంచుకొనే సన్నివేశాల్లో మరొక సీన్ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది అట.

జైలు లో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా లో అత్యద్భుతం గా ఉంటాయి అని తెలుస్తోంది. అయితే ఆ భావోద్వేగపు సన్నివేశాన్ని రాజమౌళి తనదైన శైలి లో తెరకెక్కించారు అని తెలుస్తోంది. అయితే ఆ సన్నివేశానికి కాల భైరవ వాయిస్ తో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాట ప్రేక్షకులను కంట తడి పెట్టిస్తుందట. అయితే ఈ సన్నివేశం మాత్రమే కాకుండా ఇందులో ప్రతి ఒక్క సన్నివేశం రాజమౌళి ఎంతో శ్రద్ద తో తెరకెక్కిస్తున్నారు అని తెలుస్తోంది. అయితే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల సరసన అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయిక లు గా నటిస్తుండగా, అజయ్ దేవగణ్, శ్రియ, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.