బిగ్ వైరల్ : ప్రభాస్ ఇంటి ముందు ఏమి జరిగిందో తెలుసా?

Wednesday, June 12th, 2019, 03:35:48 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలో అగ్ర హీరోగా పేరు సంపాదించుకున్న హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. అయితే మంచి హైట్, బాడీ, డైలాగ్స్, యాక్షన్ ఇలా అన్ని అంశాలు ప్రభాస్‌లో కనిపించడంతో కుర్రకారు ప్రభాస్ అంటే పడి చచ్చి పోతున్నారు. ఇక అమ్మాయిల పరిస్థితి మాత్రం చెప్పనక్కర్లేదు. మీకు ఎలాంటి భర్త రావాలని ఏ అమ్మాయిని అడిగినా నాకు ప్రభాస్‌లాంటి మొగుడు కావాలని కోరుకుంటున్నారట.

అయితే ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సాహో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ హీరోగా, శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే బాహుబలి సినిమా తరువాత, ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్‌కి ఎంత క్రేజ్ వచ్చిందంటే జపాన్‌లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు తాహాగా జ‌పాన్‌కి చెందిన కొంత మంది అమ్మాయిలు హైద‌రాబాద్‌లోని ప్ర‌భాస్ ఇంటికి వెళ్లి ఆయ‌న ఇంటిముందు ర‌కర‌కాల భంగిమ‌ల‌లో నిలుచొని ఫోటోకి ఫోజులిచ్చారు. అయితే ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంతేకాదు ప్రభాస్ పుట్టిన రోజును కూడా జపనీస్ పెద్ద ఎత్తున జరపడం వారికి ప్రభాస్ పట్ల ఉన్న అభిమానానికి అద్దం పడుతుంది. అందుకే జపాన్‌లో కూడా సాహో చిత్రాన్ని విడుదల చేయాలని మూవీ మేక‌ర్స్ భావిస్తున్నారట.