మెగాస్టార్ సైరా బడ్జెట్… ఏంతో తెలుసా ?

Sunday, October 29th, 2017, 10:47:25 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151 వ చిత్రం సైరా నరసింహ రెడ్డి. స్వతంత్ర సమయరయోదుడు ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా బాహుబలి రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తారట. దేశం గర్వపడే రీతిలో తెరకెక్కిస్తామని దర్శకుడు సురేందర్ రెడ్డి తెలిపాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తీ అవ్వడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిది దశకు చేరుకున్నాయి, డిసెంబర్ నుండి రెగులర్ షూటింగ్ జరుపుకునే ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా .. ఏకంగా 200 కోట్లట !! బాహుబలి తరువాత ఆ రేంజ్ తో తెరకెక్కుతున్న చిత్రమిదే. ప్రస్తుతం దర్శకుడు సురేందర్ రెడ్డి కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉయ్యాలవాడ పుట్టిన ప్రాంతం అంతా ఎలా ఉందొ అంచనాలు వేస్తున్నారు .. దాంతో పాటు హైద్రాబాద్ పరిసరాల్లో ఇప్పటికే సైరా కోసం భారీ సెట్టింగులు కూడా సిద్ధం అవుతున్నాయి.