అక్కడ టాప్ ఓపెనింగ్స్ రాబట్టిన సాహొ…దంగల్ రికార్డ్ బ్రేక్!

Thursday, July 23rd, 2020, 12:41:51 AM IST


ప్రభాస్ సినిమాలకు విదేశాలలో క్రేజ్ ఏర్పడింది. బాహుబలి సిరీస్ చిత్రాలతో ప్రభాస్ ఇంటర్ నేషనల్ హీరో గా మారిపోయారు. ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం భారతీయ సినీ పరిశ్రమ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం జపాన్ లో విడుదల కాగా, అక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. అయితే ఆ తర్వాత వచ్చిన సా హొ చిత్రం తెలుగు లో ఆశించిన విజయం సాధించలేదు. అయితే బాలీవుడ్ లో భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఇపుడు జపాన్ లో భారీ వసూళ్లను కొల్లగొడుతోంది.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడం జరిగింది. అయితే జపాన్ లో కరోనా తీవ్రత తగ్గడం తో మళ్లీ సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. అక్కడ విడుదల అయిన ఒకే ఒక్క జపానేతర చిత్రం సా హొ. ఈ చిత్రం భారీ ఓపెనింగ్స రాబట్టింది. ఇప్పటి వరకూ దంగల్ చిత్రం భారీ వసూళ్లను రాబట్టగా, ఇపుడు సా హో ముందు వరుసలో ఉంది. అక్కడ టాప్ 5 ఇండియన్ మూవీస్ లో ప్రభాస్ బాహుబలి 2, సా హొ చిత్రాలు ఉండటం గమనార్హం. సా హొ చిత్రాన్ని దర్శకుడు సుజిత్ తెరకెక్కించగా, హీరోయిన్ గా శ్రద్ద కపూర్ నటించారు.