డోంట్ మిస్: గుర్తింపు పొందిన చిన్న సినిమాలకు పెద్ద గౌరవం

Monday, October 21st, 2019, 11:36:47 AM IST

తెలుగు సినీ పరిశ్రమ లో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలకే ఆదరణ ఎక్కువ అని చెప్పాలి. ప్రేక్షకుల్ని రంజింప చేయడం లో, మానవీయ బంధాల్ని, అనురాగాల్ని చూపించడం లో వీరు ముందుంటారు. అయితే విమర్శకుల ప్రశంసలు పొందిన దొరసాని, కేర్ అఫ్ కంచరపాలెం, మల్లేశం, మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు చిత్రాలు ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాయి. ఈ చిత్రాలు ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు సారథి ప్రివ్యూ థియేటర్ లలో ప్రదర్శితం కానున్నాయి.

ఈ చిత్రాలన్నిటికి ఉచితంగా ప్రవేశం వున్నది. ముందుగా వచ్చిన వారు మాత్రమే ఈ చిత్రాలను చూసే అవకాశం వున్నది. అయితే చిత్రాల ప్రదర్శించిన అనంతరం ఆ చిత్రాలకు సంబందించిన నటీనటువులతో ఇంటరాక్షన్ వున్నది. కావున ప్రేక్షకులు తమ అభిమాన చిత్రాన్ని చూసేందుకు సారథి ప్రివ్యూ థియేటర్, అమీర్పేట్ కు రాగలరు. అక్టోబర్ 21 న సాయంత్రం 6 గంటలకు ఈ స్పెషల్ షో ప్రారంభం కానున్నది. హైదరాబాద్ ఫిలిం క్లబ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.