నేను ఫ్యామిలీ టైప్ కాదు.. శ్రీ‌రెడ్డి దొరికిపోయిందిగా!!

Monday, June 10th, 2019, 11:59:47 PM IST

టాలీవుడ్ పై శ్రీ‌రెడ్డి వీరంగం గురించి తెలిసిందే. ప్ర‌తిసారీ ఏదో ఒక అనుచిత వ్యాఖ్య చేయ‌డం ద్వారా మీడియాలో పాపులారిటీ పెంచుకుంటూనే ఉంది. అయితే ఈసారి మ‌రీ డీగ్రేడ్ వ్యాఖ్య‌ల‌తో త‌నంత‌ట తానుగానే దొరికిపోయింది. త‌న ఛీఫ్ క్యారెక్ట‌ర్ ని బ‌య‌ట‌పెట్టుకోవ‌డం తెలుగు ప్ర‌జ‌ల్లో హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వివాదం.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. వంటి కార‌ణాల‌తో జాతీయ స్థాయిలో పాపుల‌ర్ అయింది శ్రీ‌రెడ్డి. ఆ త‌రువాత కూడా ప‌లు సంద‌ర్భాల్లో మెగా సెల‌బ్రిటీల‌పై ప‌చ్చి బూతు కామెంట్లు రాస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. తాజాగా పెళ్లిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఏవిష‌యంపైన అయినా ప‌చ్చిగా మాట్లాడే శ్రీ‌రెడ్డి పెళ్లి విష‌యంపై కూడా అదే స్థాయిలో స్పందించి అంద‌రిని షాక్‌కు గురిచేసింది. త‌న మైండ్ సెట్ ప్ర‌కారం త‌న‌కు పెళ్లి సూట్ కాద‌ని, త‌న‌కు న‌చ్చిన‌ట్లు విచ్చ‌ల‌విడిగా వుండ‌టానికే అధిక ప్రాథాన్య‌తనిస్తాన‌ని తేల్చి చెప్పేసింది. డేటింగ్ విష‌యంలోనూ త‌న‌కు క్లారిటీ వుంద‌ని ఏడాది పాటు డేటింగ్‌లో వుంటే మ‌హా ఎక్కువ‌ని, ఆ త‌రువాత కొత్త పార్ట్‌న‌ర్ ని వెతుక్కుంటాన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.

తాను ఫ్యామిలీ టైమ్ కాద‌ని, అలా వుండ‌టం త‌న‌కు అస్స‌లు సూట్ కాద‌ని చెప్పేసింది. త‌ను ప్లే గ‌ర్ల్ టైప్ అని అలాంటి జీవితాన్నే ఇష్ట‌ప‌డ‌తాన‌ని, దాన్నే ఎక్కువ‌గా ఎంజాయ్ చేస్తాన‌ని ఎలాంటి మోహ‌మాటం లేకుండా చెప్ప‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. గ‌త కొంత కాలం క్రితం ఓ టీవీ ఛాన‌ల్‌లో యాంక‌ర్‌గా పనిచేసి ఆ త‌రువాత అవ‌కాశం రావ‌డంతో ఓ సినిమాలో మెరిసిన శ్రీ‌రెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌, మా స‌భ్య‌త్వం వంటి కార‌ణాల‌ని అడ్డు పెట్టుకుని తారా స్థాయికి త‌న పాపులారిటీని పెంచేసుకుంది. ప్ర‌స్తుతం ఆమె గురించి కామెంట్ చేయాలంటేనే సెల‌బ్రిటీలు భ‌యంతో పారిపోయే ప‌రిస్థితి. అన్న‌ట్టు తెలుగు బిగ్ బాస్ షోలో ఎంట్రీ కోసం హీరో నానిని అన‌రాని మ‌ట‌లు అన్న శ్రీ‌రెడ్డి త్వ‌ర‌లో త‌మిళంలో ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్ షోలో పాల్గొన‌బోతోంది. అక్క‌డ ఆ షోతో ఎంత ర‌చ్చ చేస్తుందో చూడాలి.