ఎన్టీఆర్ తో ఆ సీక్వెల్ చేస్తానంటున్న దర్శకుడు?

Tuesday, November 7th, 2017, 10:44:15 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తప్పకుండా అదుర్స్ సినిమా రీమేక్ చేస్తానని అంటున్నాడు దర్శకుడు వినాయక్. వీరిద్దరి కాంబినేషన్ ఇప్పటిది కాదు. వినాయక్ దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టింది ఎన్టీఆర్ తోనే .. ఆదితో కెరీర్ మొదలు పెట్టిన వినాయక్ ఆ తరువాత సాంబా, అదుర్స్ చిత్రాలను తీసాడు. అదుర్స్ సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్ ప్లాన్ చేసాడు వినాయక్. అయితే అటు ఎన్టీఆర్ వేరే సినిమాల కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడం, వినాయక్ కూడా ఇతర సినిమాల వల్ల ఆ సీక్వెల్ కుదరడం లేదు .. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం అవుతుందని, త్వరలోనే ఎన్టీఆర్ కు వినిపించి ఆయనతో సినిమా చేస్తానని అంటున్నాడు వినాయక్. ఇప్పటికే కోన వెంకట్ రంగంలోకి దిగాడట. సో ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా అయ్యాకా వినాయక్ తో చేస్తాడేమో ఎన్టీఆర్. చూద్దాం ఏమి జరుగుతుందో.

  •  
  •  
  •  
  •  

Comments