రామానుజాచార్యులుగా నటిస్తానంటున్న బాలయ్య ?

Friday, January 19th, 2018, 09:48:49 AM IST

మొత్తానికి బాలకృష్ణ జై సింహ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే అయన నటించిన జై సింహ సంక్రాంతి కానుకగా విడుదలై ఏ సినిమా పోటీ ఇవ్వకపోవడంతో మంచి వసూళ్ల దిశగా పరుగులు పెడుతుంది. దాంతో ఈ సినిమా విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఇక బాలకృష్ణ రామానుజాచార్యులు గా నటిస్తానని చెప్పి ఫాన్స్ కు కొత్త షాక్ ఇచ్చాడు. ఇప్పటికే వరుస సినిమాలతో దూసుకుపోతున్న బాలయ్య 103 వ సినిమా కోసం రంగం సిద్ధం అయింది. అయితే జై సింహ వేడుకలో రామానుజాచార్యులు గా నటిస్తానని చెప్పడంతో అయన నెక్స్ట్ సినిమా అదేనా అనే సందేహాలు ఎక్కువయ్యాయి. అయితే ఈ సినిమా ఇప్పుడే కాదని మరో మూడేళ్ళ తరువాత నటిస్తానని తెలిపాడు. తనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువేనని, అన్ని మతాలకు చెందిన గ్రందాల్లోని సారాన్ని తెలుసుకుంటానని తన అరవయ్యో ఏటా రామానుజాచార్యులుగా నటిస్తానని తెలిపారు. సో మొత్తానికి బాలయ్య ఫోకస్ భక్తి సినిమాలపై కూడా సోకిందన్నమాట.