అన్నీ కుదిరితే “RRR” వచ్చేది అప్పుడే.!

Sunday, July 26th, 2020, 06:14:56 PM IST

ప్రస్తుతం మన దేశంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుకున్నా ఈ భారీ పీరియాడిక్ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానీ ఈ చిత్రం కరోనా మూలాన షూటింగ్ ఆగిపోయింది.

ఇప్పటికే 70 శాతం పూర్తయిన ఈ చిత్రం కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలని ఈ చిత్రం డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్న సెంథిల్ తెలిపారు. ఈ చిత్రం ఇప్పుడప్పుడే షూటింగ్ మొదలు కావడం కుదరదని ఈ చిత్రం మొదటి నుంచి షూటింగ్ మరియు ఎడిటింగ్ వర్క్ కూడా అంతా సరిసమానంగా చేస్తూ వచ్చామని కానీ ఇప్పుడు కరోనా వల్ల అంతా మారిపోయింది అని..

ఇప్పుడైతే రెండు మూడు నెలల వరకు మొదలు కాకపోవచ్చని ఆ దేవుడి దయ వాళ్ళ పరిస్థితులు ముందే కనుక చక్కబడినట్టయితే అనుకున్న సమయానికే తీసుకువస్తామని వారు అన్నారు. అంటే వీరు మొదట సంక్రాంతి రేస్ లో చిత్రాన్ని తీసుకొస్తామని చెప్పారు. సో ఆ సమయానికి తీసుకొస్తామని చెప్తున్నారు. మరి ఏం జరగనుందో చూడాలి.