ఇది కూడా తోడైవుంటే “మహర్షి” రిజల్ట్ వేరేలా ఉండేది!

Sunday, June 9th, 2019, 07:33:07 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా “మహర్షి” బాక్సాఫీస్ దగ్గర లెక్కలు మార్చే పనిలో బిజీగా ఉంది.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై నెల రోజులు కావస్తున్నా సరే ఇంకా పలు చోట్ల స్ట్రాంగ్ వసూళ్లను రాబడుతూ హౌస్ ఫుల్స్ తో ఆశ్చర్యపరుస్తుంది.అయితే మహేష్ కు అటు ఫ్యామిలీ మాస్ మరియు క్లాస్ ఆడియన్స్ లో కూడా మంచి పట్టున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమా మాత్రం అధికంగా క్లాస్ ఆడియన్స్ మరియు కుటుంబ ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ఉండడం వలన ఇప్పటి వరకు ఇంతలా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు.

అలాగే సినిమా నిడివి కాస్త పెద్దది కావడం మరియు మాస్ ఎలివేషన్ సీన్స్ మోతాదు కూడా తక్కువ ఉండడం మహేష్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించాయి.ఈ మాస్ ఆడియన్స్ కు కూడా సంబంధించి కొంచెం డోస్ పెంచి కానీ కొన్ని సీన్లు కట్ చేసి ఉంటే ఆ రిజల్ట్ ఇంకోలా ఉండేదని చెప్పాలి.అప్పుడు మరింత ఎక్కువ స్థాయిలో క్రౌడ్ పుల్లర్ గా మహేష్ మారి ఉండేవారు.ఓన్లీ సాఫ్ట్ ఆడియన్స్ ఎక్కువగా వీక్షించిన ఈ సినిమాకు మాస్ ఆడియెన్స్ కూడా తోడైతే మాత్రం ఓవరాల్ గా కూడా నాన్ బాహుబలి రికార్డులు కొట్టేదని మహేష్ అభిమానులు అంటున్నారు.