ఇలియానా @ 9మిలియన్స్

Thursday, October 25th, 2018, 05:57:55 PM IST

ప్రస్తుత సోషల్ మీడియా జనరేషన్ లో ఫేస్బుక్ కి కాస్త గిరాకీ తగ్గింది, ఇన్స్టాగ్రామ్ కి మాత్రం రోజు రోజు కి పెరుగుతోంది దీనికి కారణం అందమైన భామలందరు ఇంస్టాగ్రామ్ లో చేరి వారి ఫోటో లతో హల్చల్ చేస్తుండటమే. తాజాగా గోవా బ్యూటీ ఇలియానా ఇంస్టాగ్రామ్ లో ఓ ఘనత సాధించింది ఇన్స్టా లో ఆమె ఫాలోయర్స్ సంఖ్య 9మిలియన్ల మార్క్ చేరుకుంది.

ఈ సందర్భం లో ఇలియానా అనందంలో తబ్బిబ్బయి ఒక ఫోటో ను ఇన్స్టాగ్రామ్ లో తన అభిమానులతో పంచుకుంది, అయితే అది ఆమె పాత ఫోటో అవటం గమనార్హం. ఇటీవల ముంబై లోని బాంద్రా ఏరియా లో కూరగాయలు కొంటూ కెమెరా కంటికి చిక్కింది ఈ భామ ఆ ఫోటో లో కొంచెం ఒళ్ళు చేసినట్టు కనిపించింది, దాంతో నెటిజన్లు తమ వేళ్ళకు పని చెప్పారు కొందరు ఆండ్రూ తో పెళ్లి తర్వాత లావయ్యింది అంటే మరికొందరు పెళ్లి విషయం ఐతే దాచింది గాని, ప్రెగ్నెన్సీ విషయాన్నీ దాచలేదు కదా అని కామెంట్ చేసారు. పొతే తాను “9మిలియన్ లవ్ యూ గైస్ … ” అంటూ షేర్ చేసిన పాత ఫోటో కి పిక్ క్రెడిట్స్ అంటూ ఆండ్రూ ని టాగ్ చేయటం మరువలేదు.

  •  
  •  
  •  
  •  

Comments