అందులో నిజం లేదంటున్న గోవా భామ ?

Sunday, April 22nd, 2018, 11:04:50 PM IST


గోవా భామ ఇలియానా ఈ మధ్య చేతిలో సినిమాలు లేవు కాబట్టి .. మీడియా లో ఫోకస్ అవ్వడం కోసం రకరకాలుగా ఫోటోలకు ఫోజులిస్తూ నానా హంగామా చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలు లేకపోవడంతో తన బాయ్ ఫ్రెండ్ తో సరదాగా షికార్లు కొట్టింది. తాజాగా ఇలియానా ప్రెగ్నెంట్ అంటూ బి టౌన్ మీడియా లో తెగ ప్రచారం జరుగుతుంది. ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రొ నిబోన్ ని రహస్యంగా వివాహం చేసుకుందని ప్రచారం జరుగుంది. ఈ విషయం పై ఇలియానా పెదవి విప్పలేదు .. తాజగా ప్రెగ్నెంట్ అని తన పై వస్తున్న పుకార్లపై స్పందించింది. తాను గర్భవతిని కాదంటూ .. ఓ ఫోటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. మరి పెళ్లి విషయం పై ఇలియానా మాట్లాడక పోవడానికి కారణాలు ఏంటనే దిశగా ఆరాలు మొదలయ్యాయి.

  •  
  •  
  •  
  •  

Comments