ఆకట్టుకుంటున్న “సిరివెన్నెల” ట్రైలర్

Tuesday, July 23rd, 2019, 02:29:55 AM IST

మన సినిమాల విషయానికొస్తే ఎప్పటికైనా హారర్ సినిమాలని ప్రేక్షకులు ఎప్పటికి కూడా ఆదరిస్తూనే ఉంటారు. కథలో గట్టి సత్తా చూపగలిగితే చాలు సినిమా హిట్ అయినట్లే… అంతేకాకుండా ఇక హారర్‌ చిత్రాలకు సీజన్‌తో పని ఉండదు, ఎప్పుడు ఎలాంటి సమయంలో వచ్చిన కూడా ఆడేస్తది. అందుకే మన వాళ్లు హారర్‌ సినిమాలు రెగ్యులర్‌గా తెరకెక్కిస్తుంటారు. దెయ్యాలు, ఆత్మల కథలతో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు హిట్‌ అయ్యాయి. తాజాగా అదే తరహాలో కొత్తగా ప్రేక్షకులను అలరించడానికి ‘సిరివెన్నెల’ అనే చిత్రం వస్తుంది.

ఈ చిత్రంలో మెయిన్ రోల్ లో ప్రియమణి, మహానటి ఫేమ్‌ బేబి సాయి తేజస్విని నటిస్తున్నారు. ఈ ‘సిరివెన్నెల’ చిత్రానికి ప్రకాష్‌ పులిజాల దర్శకుడు. కమల్‌ బోరా, ఏఎన్‌బాషా, రామసీత నిర్మాతలు. అయితే ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు నీరజ్‌ పాండే ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ”సినిమాలకు దూరమైన ప్రియమణి.. కేవలం ఈ కథ నచ్చే మళ్లీ నటించడానికి ఒప్పుకున్నారు. ప్రియమణి నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ” అన్నారు. ప్రియమణి కెరీర్‌లో ఓ వైవిధ్యభరితమైన చిత్రంగా ‘సిరి వెన్నెల’ నిలిచిపోతుంది. చిత్రీకరణ పూర్తయింది. కాగా త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు.