బ్రేకింగ్ న్యూస్ : నాచురల్ స్టార్ నానికి షాకిచ్చిన ఐటీ అధికారులు!

Wednesday, November 20th, 2019, 12:49:24 PM IST

టాలీవుడ్ సినీ వర్గాల్లో ఈరోజు ఉదయం సంచలనం రేగిన సంగతి అందరికి తెలిసిందే.ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబు ఇంట్లో సహా ఆయనకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ వారు ఆకస్మిక దాడులు చెయ్యడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది.టాలీవుడ్ లో ఇదే పెద్ద షాకింగ్ వార్త అనుకుంటే ఇప్పుడు ఐటీ అధికారులు నాచురల్ స్టార్ నానికి కూడా షాకిచ్చినట్టు తెలుస్తుంది.

ఒక్క సురేష్ ప్రొడక్షన్స్ కు సంబంధించే కాకుండా నాని ఇంట్లో సహా అతని ఆఫీస్ లో కూడా సోదాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.నానికి సంబంధించి గత మూడేళ్ల లావాదేవీలను ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారని వార్తలొస్తున్నాయి.అయితే నాని చూపించిన లెక్కల్లో ఏవో తేడాలు ఉన్నాయని వారు గుర్తించినట్టు కూడా తెలుస్తుంది.మరి ఇంత అకస్మాత్తుగా వీరిపైనే దాడులు చెయ్యడం ఆశ్చర్యకరంగా మారింది.మరి ఈ ఐటీ శాఖ అధికారులు వీరితోనే ఆపేస్తారా లేక మిగతా హీరోలను కూడా టార్గెట్ చేస్తారా అన్నది చూడాలి.