హాలీవుడ్ నటుడు జానీ డెప్ కు గాయాలు!

Wednesday, March 11th, 2015, 04:40:08 PM IST


హాలీవుడ్ ప్రముఖ హీరో జానీ డెప్ కు సినిమా షూటింగ్ లో గాయాలు అయ్యాయి. కాగా ‘పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్’ సూపర్ హిట్ సిరీస్ లో కెప్టెన్ జాక్ స్పారో పాత్రలో విభిన్న శైలిలో నటించిన జానీ డెప్ అభిమానుల మెప్పు పొందిన సంగతి తెలిసిందే. అయితే విజయవంతమైన ఈ సీరిస్ లో 5వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘డెడ్ మెన్ టెల్ నో టేల్స్’ షూటింగ్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. ఇక గోల్డ్ కోస్ట్ తీరంలో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్న జానీ డెప్ కు గాయాలయ్యాయని చిత్ర ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇక చేతికి తీవ్ర గాయం కావడంతో జానీ డెప్ చికిత్స కోసం అమెరికాకు తిరిగి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2017, జూలై 7న విడుదల కాబోతోంది.