‘అజ్ఞాతవాసి’లో ఐదు..త్రివిక్రమ్ సలహాతో రెచ్చిపోయాడట..!

Wednesday, November 8th, 2017, 10:20:15 PM IST

ఇప్పుడు ఎక్కడ విన్నా సినీ ప్రేమికుల మధ్య ఒకటే చర్చ జరుగుతోంది. పవన్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా గురించే అంతా చర్చించుకుంటున్నారు. నిన్ననే ఈ చిత్రంలోని తొలి పాట బైటికొచ్చి చూస్తే నెట్ లో హల్ చల్ చేస్తోంది. యువ సంగీత తరంగం అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో లిరిక్స్, సంగీతం ప్రెష్ గా అనిపించడంతో పవన్ అభిమానులు పూర్తి ఆల్బమ్ కోసం ఎదురుచూస్తున్నారు.

తాజగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అనిరుద్ ఐదు పాటలని కంపోజ్ చేసాడట. మొదట పవన్ ఇమేజే ని, కథని దృష్టిలో పెట్టుకుని సంగీతం అందించాలని అనిరుద్ అనుకున్నాడు. కానీ యువతని టార్గెట్ చేసేలా ని సొంత స్టైల్ లో సంగీతం ఇవ్వమని త్రివిక్రమ్ సలహాతో అనిరుద్ చెలరేగిపోయాడట. చిత్రంలో మిగిలి పాటలు కూడా ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర వర్గాల నుంచి సమాచారం. అన్ని పాటలు యూత్ కి కనెక్ట్ అయ్యేలా అనిరుద్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా డిసెంబర్ లో ఈ చిత్ర ఆడియో వేడుక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Comments