“భారతీయుడు 2″లో ఒక్క సీన్ కోసం అక్షరాలా__కోట్లు!

Friday, October 18th, 2019, 11:29:48 AM IST


మన దేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ దర్శకుల జాబితా తీసినట్టయతే ఆ టాప్ 3 లో ఖచ్చితంగా ఇండియన్ జేమ్స్ కేమెరూన్ శంకర్ పేరు కూడా వినిపిస్తుంది.ఒక్క భారీ విజువల్ ట్రీట్ మాత్రమే కాకుండా అదిరిపోయే యాక్షన్ మరియు మంచి సందేశం ఇవ్వడంలో శంకర్ తన సినిమాలకంటూ ఒక మార్క్ ను ఏర్పరుచుకున్నారు.అయితే తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి అయిన ”భారతీయుడు” సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ను రెడీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

విశ్వ నటుడు కమల్ హాసన్ మరియు శంకర్ ల కాంబినేషన్ లో 1996లో వచ్చిన ఈ చిత్రం ఒక సెన్సేషన్ అయ్యింది.మళ్ళీ ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ మొదలు పెట్టేసరికి మరిన్ని అంచనాలు పెరిగాయి.అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.మామూలుగానే శంకర్ సినిమాలు అంటేనే భారీ యాక్షన్ సీన్లు గ్రాఫిక్స్ తప్పని సరి అందుకే ఈ చిత్రం కేవలం ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం అక్షరాలా 40 కోట్లు ఖర్చు పెడుతున్నారట.మరి శంకర్ ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తున్నారో చూడాలి.