ఐపీఎల్-2021 సీజన్ మళ్లీ ప్రారంభం.. ఎక్కడ, ఎప్పుడంటే?

Wednesday, May 26th, 2021, 12:17:53 AM IST

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఐపీఎల్-2021 సీజన్‌ను పూర్తి చేసేందుకు రెడీ అయిన బీసీసీఐ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది యూఏఈలో ఐపీఎల్-2020ని విజయవంతంగా నిర్వహించడంతో, ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను కూడా అక్కడే నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ 19 నుంచి ఈ సీజన్ మ్యాచులను ప్రారంభించి, ఫైనల్ మ్యాచ్‌ను ఆక్టోబర్ 10న నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

ఇదిలా ఉంటే భారత్ జట్టు ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్‌లో ఉంది. అనంతరం జూన్ 2న ఇంగ్లాండ్ పయణం కానుంది. మొదట న్యూజిలాండ్‌తో డబ్యూటీసీ ఫైనల్ ఆడి, అనంతరం ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ టెస్ట్ సిరీస్ అయ్యాక నేరుగా దుబాయ్‌కి వెళ్తుందని బీసీసీఐ పేర్కొంది. ఐపీఎల్-2021ను పూర్తి చేసేందుకు సెప్టెంబర్‌లో సౌతాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్‌ను బీసీసీఐ వాయిదా వేసుకుంది.