ఆర్‌సి 12 సంక్రాంతి రిలీజ్ ఉంటుందా?

Tuesday, October 23rd, 2018, 01:55:38 PM IST

రామ్‌చ‌ర‌ణ్ – బోయ‌పాటి కాంబినేష‌న్ మూవీ ఆర్‌సి 12 ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా సాఉగ‌తోంది. 10రోజుల టాకీ, రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ పూర్తి కావాల్సి ఉందింకా. న‌వంబ‌ర్ చివ‌రి నాటికి చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి సంక్రాంతి బ‌రిలో రిలీజ్‌కి రెడీ చేయాల్సి ఉంది.

అయితే ఈ సినిమా సంక్రాంతి బ‌రిలో రిలీజ్ కావాలంటే బ్యాలెన్స్ చిత్రీక‌ర‌ణ వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వేళ బోయ‌పాటి చాలా స్లోఫేస్‌లో చిత్రీక‌ర‌ణ చేస్తున్నార‌న్న మాటా వినిపిస్తోంది. చ‌ర‌ణ్ – బోయ‌పాటి ఇద్ద‌రూ రిలీజ్ విష‌య‌మై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా, ఈ ఆల‌స్యం వాయిదాకు దారి తీసే అవ‌కాశం ఉంద‌న్న మాటా వినిపిస్తోంది. చిత్రీక‌ర‌ణ వేగంగా పూర్తి చేసి, సైమ‌ల్టేనియ‌స్‌గా నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి చేస్తేనే ప‌న‌వుతుంది. లేదంటే వాయిదా త‌ప్ప‌నిస‌రి. కానీ బోయ‌పాటి వైఖ‌రి వ‌ల్ల ఈ వాయిదా త‌ప్పేట్టు లేద‌ని, అది `ఎన్టీఆర్` బ‌యోపిక్‌కి పేవ‌ర్ అవుతుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. సంక్రాంతి బ‌రిలో బాల‌య్య `ఎన్టీఆర్‌` కోసం బోయ‌పాటి ఫేవ‌ర్ చేస్తున్నాడా.. అన్న డిబేట్ గుడ్డిగా ర‌న్ అవుతోంది. అయితే బోయ‌పాటి కెరీర్‌ని త్యాగం చేసి అంత సాయం చేస్తాడా? అన్న కోణంపైనా చ‌ర్చ సాగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments