హాట్ టాపిక్: ప్రభాస్ 21 కోసం దీపికా అంత డిమాండ్ చేసిందా?

Tuesday, July 21st, 2020, 01:48:58 AM IST


టాలీవుడ్ లో బాహుబలి చిత్రం తో భారీ బడ్జెట్ ల సినిమాలు బాగా పెరిగిపోయాయి. అయితే బాహుబలి మినహా, మిగతా ఏ చిత్రాలు కూడా ఆ స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. అయినప్పటికీ మన టాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు తమ ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. అయితే ఒక్క ప్రభాస్ ఇలా భారీ బడ్జెట్ చిత్రాలు ఫిక్స్ అయ్యారు అని చెప్పాలి. బాహుబలి సిరీస్ చిత్రాల అనంతరం, సా హొ తో ముందుకు వచ్చారు. ఇపుడు రాధే శ్యామ్ కూడా భారీ బడ్జెట్ చిత్రం. అయితే తాజాగా ప్రభాస్ 21 చిత్రం కూడా భారీ బడ్జెట్ అంటూ టాలీవుడ్ కోడై కూస్తుంది.

అయితే తాజాగా ప్రభాస్21 చిత్రం లో హీరోయిన్ గా చేసేందుకు దీపికా పదుకొనె సంప్రదించగా, అందుకు ఒకే చెప్పినట్లు తేలింది. చిత్ర యూనిట్ సైతం అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రం లో దీపికా పదుకునే నటించేందుకు గానూ 30 కోట్ల రూపాయల పారతోషికాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు చిత్ర యూనిట్ సైతం అంగీకరించినట్లు సమాచారం. అయితే కొందరు సినీ ప్రముఖులు మాత్రం ఇంత రెమ్యునరేషన్ అనవసరం అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఏ ఒక్క విషయం లో కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా పేరు కూడా పెట్టలేదు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.