బెల్లంకొండ అప్పులు తీరిపోయాయా?

Friday, November 9th, 2018, 09:10:26 PM IST

అప్పులు చేయ‌డం.. వాటిని తీర్చ‌డం .. ఫైనాన్షియ‌ర్ల‌ను కాస్త వెయిట్ చేయించ‌డం ఇవ‌న్నీ నిర్మాత‌ల‌కు అల‌వాటు వ్యాప‌క‌మేన‌ని చెబుతారు నిర్మాత బెల్లంకొండ సురేష్. కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ కెరీర్ కోసం ఆయ‌న చేసిన సాహ‌సాలు వేరొక‌రు చేయ‌లేర‌న్న ప్ర‌శంస‌లు అందుకున్నారు. అల్లుడు శీను సినిమాతో అత‌డిని అల్ట్రా రిచ్ స్టైల్లో లాంచ్ చేసిన బెల్లంకొండ‌, అటుపై వ‌రుస‌గా భారీ చిత్రాల్ని నిర్మించారు. అదంతా కొడుకు కోసం ప్రేమ‌తో. అయితే ఆ ప్రేమ తెచ్చిన ముప్పు అంతే పెద్ద‌ది అని చెబుతారు. సినిమాల కోసం బెల్లంకొండ భారీగా అప్పులు చేయ‌డంతో ఫైనాన్షియ‌ల‌ర్ల‌తోనూ అప్ప‌ట్లో గొడ‌వ‌ల‌య్యాయి. అదంతా గ‌తం అనుకుంటే వ‌ర్త‌మానంలోనూ బెల్లంకొండ వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఏవీ స‌త్ఫ‌లితాలివ్వ‌డం లేదు. అన్నీ ఫ్లాపులే. అయినా వ‌రుస‌గా సినిమాలు చేయ‌డంలో ఘ‌నాపాటి. దీనిపై ప్ర‌స్తుతం మ‌రోసారి ఫిలింన‌గ‌ర్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

అల్లుడు శీను, స్పీడున్నోడు బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాపులు. ఆ త‌రువాత చేసిన `జ‌య జాన‌కి నాయ‌క‌` ఫ‌రవాలేద‌నిపించింది. `సాక్ష్యం` బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యంగా నిలుస్తుంద‌ని భావించాడు కానీ అది జ‌ర‌గ‌లేదు స‌రిక‌దా కెరీర్‌పై అనుమానాలు రేకెత్తించింది. అయితే ఈ సారి మాత్రం ఎలాగైనా హిట్టు కొట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తో వున్నాడు శ్రీ‌నివాస్‌. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి `క‌వ‌చం` అనే పేరును ఖ‌రారు చేశారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహరీన్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ తొలిసారి ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ విల‌న్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఎప్ప‌టిలాగే బెల్లంకొండ‌కు అచ్చొచ్చిన యాక్ష‌న్ నేప‌థ్యాన్నే ఈ చిత్రానికి ఎంచుకున్నారు. ఇందులో కొత్త త‌ర‌హా యాక్ష‌న్ సీన్‌ల‌తో పాటు ప్రేమ‌క‌థ కూడా కొత్త‌గానే వుంటుంద‌ని ఇన్న‌ర్ టాక్‌. త్వ‌ర‌లోనే ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది. ఈ సినిమాతో మ‌ళ్లీ బెల్లంకొండ శ్రీనివాస్ స‌క్సెస్ బాట ప‌ట్టి క్రేజీ హీరోల రేసులో నిల‌వాలంటే ప‌రుకుత‌గ్గ‌ట్టే ఈ సినిమా అత‌ని కెరీర్‌కు క‌వ‌చంలా మారాలి. అన్న‌ట్టు బెల్లంకొండ పాత అప్పుల‌న్నీ తీరిపోయిన‌ట్టేనా?

  •  
  •  
  •  
  •  

Comments